AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండనుందంటే..
AP Weather Report: సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సైక్లోనిక్ సర్క్యూలేషన్ ఇప్పుడు జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గడ్, తెలంగాణ..
AP Weather Report: సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సైక్లోనిక్ సర్క్యూలేషన్ ఇప్పుడు జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గడ్, తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు వ్యాపించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని కారణంగా రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతాయని చెప్పారు. ఏపీలో రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం: ఇవాళ, రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్ర: ఇవాళ దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే, సోమవారం నాడు మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇక మంగళవారం నాడు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాయలసీమ: రాయలసీమ ప్రాంతంలో ఇవాళ, రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించారు. మంగళవారం మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు.
Also read:
Coronavirus: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..