YS Jagan: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో నియామకాలపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. ఇకపై అలాంటి సేవలు నిషేధం.
YS Jagan: వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా నియామకాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమారు 14 వేలకుపైగా పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం...
YS Jagan: వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా నియామకాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమారు 14 వేలకుపైగా పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్ చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఈ క్రమంలో ఈ నియామకాల విషయంలో సీఎం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. తాజాగా చేపట్టబోయే 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంతకీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటంటే.. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులు నిర్మిస్తున్నా అక్కడ సిబ్బంది ఉండడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం చేపట్టిన సమావేశంలో సీఎం ప్రస్తావించిన విషయం తెలిసిందే.
Also Read: Telangana Corona: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 239 మందికి పాజిటివ్
Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..
Nokia G50: మార్కెట్లోకి నోకియా 5జీ స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే..