YS Viveka Murder Case: ఆ నలుగురే నిందితులు.. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జ్‌షీట్

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక అప్‌‌డేట్ వచ్చింది. తాజాగా సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో నలుగురిని నిందితులుగా పేర్కొంది.

YS Viveka Murder Case: ఆ నలుగురే నిందితులు.. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జ్‌షీట్
Ys Viveka
Follow us

|

Updated on: Oct 27, 2021 | 6:42 PM

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పులివెందుల కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను సీబీఐ నిందితులుగా పేర్కొంది. వివేకా మృతికి ఈ నలుగురే కారణమంటూ.. అభియోగపత్రం సమర్పించారు అధికారులు. ఆగస్ట్, సెప్టెంబర్‌లోనే నిందితులను అరెస్ట్ చేసి జైలులో ఉంచినట్టు పులివెందుల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారని.. మరో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది.

2019 ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.  మార్చి 15, 2019న పులివెందులలోని ఆయన స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని ప్రచారం జరగ్గా.. తర్వాత హత్య అని పోలీసులు తేల్చారు. అప్పట్నుంచి ఈ కేసుల పలు మలుపులు తిరిగింది.  చివరగా.. వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. 2020 మార్చి 11న కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. మూడు నెలలు ఆలస్యంగా జులై19, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కరోనా అవాంతరాల మధ్య కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. 2021 ఏప్రిల్‌లో ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసిన వివేకా కూతురు సునీత..  రెండేళ్లు అయినా కేసులో పురోగతి లేదని, వేగంగా దర్యాప్తు జరపాలని కోరింది. ఫైనల్‌గా సీబీఐ ఫస్ట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Also Read: “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

 48 వేల మందికి ఉద్యోగాలు.. ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి