AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel By Election: ఈసీకి ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు.. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ..

Badvel By Election: కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు...

Badvel By Election: ఈసీకి ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు.. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ..
Ap Bjp
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Oct 27, 2021 | 8:50 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్లు, పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఈసీని కలిసినవారిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, రాష్ట్ర కో-ఇంచార్జి సునీల్ దేవధర్ ఉన్నారు.

బద్వేల్‌ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా. ..నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,16,139 ఓటర్లు ఉన్నారు. అందులో 1,07,340 మహిళలు ఉండగా.. 1,08,799 పురుషులు ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7(బద్వేలు, కలసపాడు, బి.కోడూరు, ఎస్‌.ఎ. కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, ఆల్టూరు) మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించారు.

Read Also.. Huzurabad And Badvel By Election: నేటితో ప్రచారానికి తెర.. హుజూరాబాద్, బద్వేల్‌లో హోరాహోరీ..