AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లు.. అందరికీ ప్రయోజనం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు ఆమోదంతో పాటు ఆస్తి పన్ను వడ్డీ మాఫీ వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లు.. అందరికీ ప్రయోజనం
Chandrababu
Venkatrao Lella
|

Updated on: Mar 26, 2026 | 9:49 PM

Share

గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయా తీసుకుంది. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్దతపై మంత్రిమండలి తీర్మానం చేసింది. 2014-19 రాజధానిని ఏర్పాటు చేసినప్పటికి.. 2019లో వచ్చిన ప్రభుత్వం రాజధానిని మార్పు చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ఒకసారి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంకోసారి రాజధాని మార్పు లాంటివి జరగకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. అందుకే ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు.

వడ్డెల సంఘాలకు రాయితీ

రాజధానిపై కక్ష పూరిత చర్యలు పునరావృత్తం కాకుండా చూడడం, పర్మినెంట్ రాజధానిగా అమరావతి ఉండాలనే ఆలోచనతో తీర్మానం పెట్టడం జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. SRM యూనివర్సిటీలో భవనం 60మీటర్లు ఎత్తు వరకు నిర్మించుకునేందుకు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నియమించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. హైకోర్టు ప్రతిపాధించిన విధంగా 96 కొత్త కోర్టుల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని, అలాగే 1730 కొత్త పోస్టుల నియామకానికి ఆమోదం లభించిందన్నారు. వడ్డెర సంఘాలకి క్వారి లీజుల్లో రాయితీ కలిపించే విధంగా కేబినేట్ ఆమోదించిందన్నారు.

ప్రజలకు సూపర్ న్యూస్

2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఏప్రిల్ 5 నుంచి 14 మధ్య ప్రతీ నియోజకవర్గంలో 2 వేల సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. ఇక పీఎం కుసుమా్ పథకం ద్వారా పవర్ లూమ్స్ తగ్గించాలని సూచించారు. ఇక 33/11 సబ్ స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించారు. విద్యుత్ వ్యవస్థపై కేబినెట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది.

సజ్జల ఫైర్

అమరావతి రాజధాని చట్టబద్ధత చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసే అవసరం ఏం వచ్చిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. “అసలు అలా చేయాలంటే మండలి కూడా పెట్టాలి.. మీరు చేస్తున్నదంత వివరించాలి. అసలు అమరావతిలో అవినీతి యజ్ఞం చేస్తున్నారు. మోడీ అప్పట్లో చంద్రబాబుకు పోలవరం ఒక ఏటీఎం అన్నారు.. ఇపుడు అమరావతి కోట్లు సంపాదించడానికి బాబుకి ఓక వనరు అయింది. అమరావతిలో టెండర్స్ వర్క్ మీద ఒక విషయం బయటికి రావటం లేదు. అంత గోప్యంగా పెట్టారు. 5000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ తెచ్చారు” అంటూ సజ్జల ఆరోపించారు.

Follow Us