Andhra Pradesh: ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా 4,100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు..

ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. 

Andhra Pradesh: ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా 4,100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు..
Aps Rtc Special Buses
Follow us

|

Updated on: Sep 22, 2022 | 2:45 PM

Andhra Pradesh: దసర పండగ సందర్భంగా ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది విజయదసమి కల్లా ‘స్టార్ లైనర్ ‘ పేరిట నాన్ ఏసీ స్లీపర్ సర్వీస్ ను ప్రారంభిస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎండి  ద్వారకాతిరుమలరావు చెప్పారు. అంతేకాదు.. దసరా పండుగ కు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ద్వారకాతిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేశమని అన్నారు. ఈ ఏడాది సరికొత్త విధానంలో ప్రయోగాత్మకంగా  ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ ఏడాది తాము చేపట్టిన విధానంలో మంచి ఫలితాలు వస్తే ఇదే విధానాన్ని ఇక నుంచి కొనసాగిస్తామని..  లేదంటే పాత విధానం అమలు గురించి మళ్లీ ఆలోచిస్తామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం.. ప్రయాణికులు ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఎవరైనా ప్రయాణికులు 0866 2570005 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేవచ్చన్నారు తిరుమలరావు.

మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎండి  ద్వారకాతిరుమలరావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం మొత్తం ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 న పీఆర్సీ మేరకు పెంచిన వేతనాలు ఇస్తామన్నారు. పదోన్నతులు పొందిన 2వేల ఉద్యోగులకు అక్టోబర్ లో పాత వేతనాలే ఇస్తామని తెలిపారు. పదోన్నతుల ఆమోదం అనంతరమే 2వేల మంది ఉద్యోగులకు పెంచిన వేతనాలు అందిచనున్నామన్నారు ఎండి  ద్వారకాతిరుమలరావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..