Andhra Pradesh: ప్రాణాలు తీసిన ఈత సరదా.. ముగ్గురు యువకులు మృతి, ప్రాణాపాయ స్థితిలో మారో ఇద్దరు
ఈత సరదా ముగ్గురి యువకుల ప్రాణాలు తీసింది. మారో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కంచికచర్ల మండలం కేసర మున్నేరులో ఈత కోసం వెళ్లి ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన 8 మంది యువకులు సరదాగా ఈత కోసం కీసర మున్నేటికి వెళ్లారు.. ఈ క్రమంలో ఒక వ్యక్తి నీటిలో మునిగిపోవడంతో అతని కాపాడే ప్రయత్నం మరొకరు చేయగా ఆ యువకుడు కూడా నీటిలో మునిగిపోవడంతో మరో ఇద్దరు వ్యక్తులకు వారిని కాపాడే ప్రయత్నం చేశారు..

కంచికచర్ల, నవంబర్ 13: ఈత సరదా ముగ్గురి యువకుల ప్రాణాలు తీసింది. మారో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కంచికచర్ల మండలం కేసర మున్నేరులో ఈత కోసం వెళ్లి ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన 8 మంది యువకులు సరదాగా ఈత కోసం కీసర మున్నేటికి వెళ్లారు.. ఈ క్రమంలో ఒక వ్యక్తి నీటిలో మునిగిపోవడంతో అతని కాపాడే ప్రయత్నం మరొకరు చేయగా ఆ యువకుడు కూడా నీటిలో మునిగిపోవడంతో మరో ఇద్దరు వ్యక్తులకు వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో 8మంది వ్యక్తులు ఒకరి వెంట ఒకరు నీటిలో మునిగిపోవడంతో ముగ్గురు యువకులు సేఫ్ గా బయటకు వచ్చేశారు. మిగిలిన ఐదుగురు యువకులు నదిలో గల్లంతు అవ్వడంతో స్థానికులు, పోలీసులు లో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఐదుగురు యువకులను బయటకు బయటకు తియ్యగా వీరిలో ముగ్గురు యువకులు అప్పటికే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు సెలవులు కావడంతో సరదాగా ఈతకు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
ముగ్గురు యువకుల మృతిలో ఐతవరంలో విషాధ చాయలు అలుముకున్నాయి.మృతులను నందిగామ మార్చురీకి తరలించారు. ప్రతీ ఏడాది కృష్ణ నది చివర్లో, పాయల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈత సరదతో ఇప్పటి వరకు ఇలా అనేకమంది కృష్ణ నదిలో పడి చనిపోయారు… కనీసం ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో డేంజర్ బోర్డ్స్ తో పాటు సెక్యురిటి పెంచాలని కోరుతూన్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




