Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వారందరికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పండగలాంటి వార్త

రాష్ట్రంలోని యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. బీసీ, ఈబీసీ, కాపు యువతకు అండగా నిలిచేందుకు సిద్దమైంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

AP News: వారందరికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పండగలాంటి వార్త
Andhra Government
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 26, 2024 | 10:19 AM

పారిశ్రామిక రంగంలో రాణించాలని చాలామంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ వారు సరైన తోడ్పాడు, ఆర్థిక సహకారం ఉండదు. దీంతో తమ ఆశలు చంపుకుంటూ ఏవో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అండగా నిలవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ముఖ్యంగా బీసీ, కాపు యువత, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వారికి చేయూత అందించేందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఆంధ్రాలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే NIMSME సంస్థతో ఆయాశాఖల అధికారులు చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థులకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.  ఏటా 2,000ల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం 2,000ల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ….ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది ఉండనున్నారు. ఈ వర్గాల నుంచి ఒక్కొ బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈడీపీ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 4 లేదా 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చే చాన్స్ ఉంది.

ట్రైనింగ్‌కు ఎంపిక చేసేందుకు ప్రత్యేకమైన పద్దతి అవలంభించబోతున్నారు. ఈ ఐదేళ్లలో 9,000ల మందిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేలా ఏపీ సర్కార్ ముందుకు వెళ్తోంది. NIMSMEలో శిక్షణ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకూ ప్రభుత్వం సాయం చేస్తుంది. ఈడీపీ కార్యక్రమం ద్వారా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వారు తమ ఆలోచనలను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే చాన్స్ ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..