AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tallapaka: తాళ్లపాక చెరువులో కంప చెట్లు తొలగిస్తుండగా బయపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం

తాళ్లపాక చెరువులో పురాతన శివలింగం వెలుగు చూసింది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు జన్మించిన స్థలంలో వెలిసిన ఈ శివలింగానికి విశేష చారిత్రక ప్రాధాన్యత ఉందని భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని భక్తులు, నేతలు తెలిపారు.

Tallapaka: తాళ్లపాక చెరువులో కంప చెట్లు తొలగిస్తుండగా బయపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం
Shivaling Unearthed
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jul 14, 2025 | 8:39 PM

Share

పద కవితా పితామహుడు తొలితెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ అన్నమాచార్యుడు జన్మించిన తాళ్లపాక చెరువులో పురాతన శివలింగం బయటపడింది. చెరువులోని కంప చెట్లను తొలగిస్తూ ఉండగ నాలుగు అడుగుల శివలింగం దర్శనమించింది. శివలింగానికి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక అన్నమాచార్యుల ధ్యాన మందిరం పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో పురాతన కాలం శివలింగం బయట పడింది. ఆ చెరువులో గతంలో నేరేడుమిట్ట ఉంది. అక్కడే శివలింగం ఉంది. నేరేడుమిట్ట మీద ఉన్న ఆ శివలింగాన్ని నేరేడీశ్వరుడు అని అంటారు. లేదా నీలకంటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. పూర్వం అక్కడ గుడి ఉండి ఉండవచ్చని, అందువల్లనే అక్కడ శివలింగం ఉందని పూజారులు అంటున్నారు. చెరువులో కంప మొక్కలు తొలగించడంతో శివలింగం కనిపించింది.

Shivaling

Shivaling

సోమవారం తాళ్లపాకలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం పూర్తి కాగానే పూజారులు చెరువులోని శివలింగం వద్దకు వెళ్లి అక్కడ శివలింగాన్ని శుభ్రపరిచి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో తాళ్లపాక గ్రామంలోని పలువురు మహిళలు, భక్తులు హాజరై ఆవుపాలతో ప్రతి ఒక్కరు అభిషేకం నిర్వహించారు. ఈ శివలింగం శతాబ్దాల నాటిదై ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు శివలింగం వద్దకు వచ్చి పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శివలింగం బయలుపడ్డ ప్రాంతంలో శివాలయం నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పురాతన వారసత్వ సంపదను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. మొత్తం మీద తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించిన జన్మస్థలంలో పురాతన శివలింగం బయటపడడంతో ఈ శివలింగానికి విశేష చరిత్ర కలిగి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దీని చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తామని వారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.