AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటపడిన పురాతన విగ్రహాలు! ఇంకా ఉన్నాయి, తవ్వకాలు జరపాలని స్థానికుల డిమాండ్

పల్నాడు జిల్లా ముప్పాళ్లలోని వీరాంజనేయస్వామి ఆలయానికి చెందిన 100 ఏళ్ల నాగేంద్ర స్వామి విగ్రహాన్ని తవ్వకాల ద్వారా గ్రామస్థులు కనుగొన్నారు. పూడిపోయిన ఆలయ స్థలంలో విగ్రహం దొరకడంతో పాటు, గొల్లభామ విగ్రహం కూడా లభించింది. మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పురావస్తుశాఖ అదనపు తవ్వకాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.

బయటపడిన పురాతన విగ్రహాలు! ఇంకా ఉన్నాయి, తవ్వకాలు జరపాలని స్థానికుల డిమాండ్
Ancient Nagendra Swami Stat
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 8:49 PM

Share

పల్నాడు జిల్లాలోని ముప్పాళ్లలో వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే వందేళ్ల క్రితం పూజలందుకున్న నాగేంద్ర స్వామి విగ్రహం గ్రామంలోనే ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వందేళ్ల క్రితం అక్కడో ఆలయం ఉండేదని అక్కడే విగ్రహాలు కూడా ఉండేవని పెద్దలు చెబుతుండేవారు. ఈ క్రమంలోనే వీరాంజినేయ స్వామి ఆలయంలో నాగేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది సూచించారు. ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు గ్రామంలోనే నాగేంద్ర స్వామి విగ్రహం ఉందని అయితే కాలక్రమేనా భూస్థాపితం అయిందని వారు చెప్పుకొచ్చారు.

దీంతో కొత్త విగ్రహం బదులు భూస్థాపితం అయిన విగ్రహాన్ని బయటకు తీసి పున: ప్రతిష్ట చేయాలని మరికొంతమంది సూచించారు. అయితే పెద్దలు చెప్పిన ప్రాంతంలో పది అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. ఎక్కడా ఆలయ ఆనవాళ్లు లేవు. అయితే నిజంగా విగ్రహం అక్కడా ఉందా లేదా అన్న అనుమానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే వీరాంజనేయ ఆలయ పూజారి రాధాక్రిష్ణ కిషోర్ కూడా తమ పూర్వీకులు అక్కడున్న విగ్రహానికి పూజలు చేసినట్లు చెప్పేవారని అక్కడ తవ్వకాలు చేస్తే విగ్రహం బయటపడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో స్తానికులంతా కలిసి గ్రామంలోని ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు.

ఆరుఅడుగులు తవ్విన తర్వాత నాగేంద్ర స్వామి విగ్రహంతో పాటు గొల్లభామ విగ్రహం కూడా బయటపడింది. దీంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. వందేళ్ల క్రితం పూడిపోయిన విగ్రహం తిరిగి బయటపడటంతో పున:ప్రతిష్టించేందుకు సిద్దమయ్యారు. నాగేంద్ర స్వామి విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు కూడా ఉండేవని అంటున్నారు. వాటి కోసం ఆ ప్రాంతంలో మరింతగా తవ్వకాలు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పురావస్తుశాఖాధికారులు ముందుకొచ్చి వందేళ్ల నాటి ఆలయ ఆనవాళ్లను బయట పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.