AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సుకన్య మామూల్ది కాదు.. నిద్రపోతున్న భర్తను రోకలిబండతో చంపి.. ఏకంగా ఇంట్లోనే..

దాదాపు నాలుగు నెలల క్రితం భర్తను రోకలిబండతో కొట్టి చంపి.. శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది ఆ భార్య.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.. భర్త కనిపించడం లేదని అందరినీ నమ్మించింది.. అయితే.. నాలుగు నెలల క్రితం జరిగిన మర్డర్ ఇప్పుడెలా బయటపడింది? అంటే తండ్రిని.. తన తల్లే చంపిందని.. స్వయంగా కూతురే పోలీసులకు సమాచారం ఇచ్చింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో సంచలనంగా మారింది.

Andhra: సుకన్య మామూల్ది కాదు.. నిద్రపోతున్న భర్తను రోకలిబండతో చంపి.. ఏకంగా ఇంట్లోనే..
Crime News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 27, 2026 | 8:28 PM

Share

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత చెరువులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత చెరువు గ్రామానికి చెందిన బోయ సుకన్య బోయ హనుమంతు దంపతులకు ఒక కుమారుడు సందీప్, ఒక కుమార్తె అమృత సంతానం.. భర్త హనుమంతు గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్య సుకన్యకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడంతో.. భర్త హనుమంతుకు నిత్యం గొడవలు జరిగేవి.. దీంతో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని నాలుగు నెలల క్రితం ఓ రోజు రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్త హనుమంతు తలపై రోకలిబండతో కొట్టి భార్య సుకన్య హత్య చేసింది. భర్తను హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఇంటి కాంపౌండ్ లోనే గుంట తవ్వి పూడ్చి పెట్టింది. తండ్రిని చంపిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అటు కూతురు అమృతను కూడా తల్లి సుకన్య బెదిరించింది.

నాలుగు నెలలుగా బిక్కుబిక్కుమంటూనే ఉంటున్న కూతురు.. ఆ తల్లి మధ్య గొడవ మొదలైంది. కూతురు అమృత వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాననడంతో.. తల్లి సుకన్య ఆ ప్రేమ పెళ్లిని నిరాకరించింది. దీంతో కూతురు అమృత తన తండ్రి హనుమంత్ ను తల్లి సుకన్య నాలుగు నెలల క్రితం హత్య చేసి ఇంట్లో పాతిపెట్టిందని, తండ్రి తరపు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న నిందితురాలు సుకన్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.

నాలుగు నెలలుగా భర్త హనుమంతు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లిపోయాడని.. బంధువులకు మాయమాటలు చెప్పింది. తల్లి కూతుళ్ళ మధ్య గొడవతో.. హనుమంత్ హత్యోదంతం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాలుగు నెలల క్రితమే భర్తను చంపి భార్య సుకన్య ఇంట్లోనే పాతి పెట్టడంతో.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.. ఫోరెన్సిక్ నిపుణుల బృందం వచ్చిన తర్వాత డెడ్ బాడీని బయటకు తీస్తామని పోలీసులు చెప్పారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us