బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. పోలీసుల వనభోజన మహోత్సవంలో సందడి..

బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. పోలీసుల వనభోజన మహోత్సవంలో సందడి..

తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన సంగతే.. చిన్నా, పెద్ద సంబంధం లేకుండా

Rajitha Chanti

|

Dec 02, 2021 | 7:39 PM

తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన సంగతే.. చిన్నా, పెద్ద సంబంధం లేకుండా బుల్లెటు బండి పాటకు స్టెప్పులేశారు. మామూలు వ్యక్తులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు.. రాజకీయ నాయకులు సైతం ఈ పాటకు చిందులేశారు. మరోవైపు.. సోషియల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇటీవల ఈ పాటకు స్టెప్పులేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. గతంలో బుల్లెట్టు బండి పాటకు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించారు.

తాజాగా పోలీస్ అధికారులు కూడా ఈ పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. ప్రతి రోజు యూనిఫామ్ లో ఎంతో సీరియస్ గా కనిపించే.. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. పిల్లలతో కలసి బుల్లెట్ బండి సాంగ్ కి స్టెప్పులు వేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వీక్లీ ఆఫ్ లో ఉన్న పోలీసులు వారి కుటుంబ సభ్యులు కంబదూరు మండలం రామప్పబండ వద్ద ఇవాళ పోలీసుల వన భోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సబ్ డివిజన్ పరిధిలో వీక్లీ ఆఫ్ లో ఉన్న సిబ్బందిని ఒకచోట చేర్చి ఆటల పాటలతో సందడిగా గడిపారు. ఈ సందర్భంగా పోలీసుల పిల్లలు పాటలకు డ్యాన్సులు వేస్తుంటే జిల్లా ఎస్పీ కూడా వారితో కలిసి స్టెప్పులు వేశారు. దీంతో అక్కడున్న పోలీసులంతా ఆశ్చర్యపోయారు. ఎస్పీ ఏంటి స్టెప్పులు వేయడం ఏంటని.. కాసేపు దీని నుంచి తేరుకున్న సిబ్బంది కూడా స్టెప్పులు ఎంజాయ్ చేస్తూ గడిపారు. పోలీసులు నిత్యం పని ఒత్తిడిలో తలమునకలైన వారికి ప్రభుత్వం వీక్ ఆఫ్ ఇచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు వీక్లీ ఆఫ్ రోజున ఊరట కల్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఇది ఎంతో మంచి పరిణామం అన్నారు.

Also Read:  Paris Olympics 2024: మిషన్ ఒలింపిక్స్‌లో ఏడుగురు మాజీ అథ్లెట్లు.. పారిస్ 2024 లక్ష్యంగా సన్నాహాలు: అనురాగ్ ఠాకూర్

Road Accident: ఘాట్ అందాలు చూస్తుండగా పోయిన ప్రాణం.. శ్రీశైలం రోడ్‌లో యువతి మృతి

AP PRC: ఉద్యోగ సంఘాలకు షాక్.. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్.. PRC సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ..

Bigg Boss 5 Telugu: ఫినాలే రేస్‏లో గాయపడి బెడ్‏కే పరిమితమైన శ్రీరామచంద్ర.. ప్రియ కామెంట్స్ వైరల్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu