Anandayya Mandu: నెల్లూరు జిజిహెచ్‌లో పెరుగుతున్న ఆనందయ్య మందు బాధితులు.. 98కి చేరిన రోగుల సంఖ్య..!

నెల్లూరు ఆనందయ్య మందు తీసుకున్న వారు చాలా మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో 98 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు.

Anandayya Mandu: నెల్లూరు జిజిహెచ్‌లో పెరుగుతున్న ఆనందయ్య మందు బాధితులు..  98కి చేరిన రోగుల సంఖ్య..!
Side Effects Of Nellore Anandayya Natumandu
Follow us
Balaraju Goud

|

Updated on: May 28, 2021 | 9:41 AM

Anandayya Nattu Mandu:  నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన మందుపై ఇప్పటి వరకు ఏలాంటి నిర్ణయం వెలువడలేదు. మందుకు సంబంధించి సేకరించిన పరిశోధన ఫలితాలను న్యూఢిల్లీలోని సీసీఆర్ఏఎస్‌కి అధికారులు పంపారు. ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీని నిలిచిపోయింది. ఈ మందు గురించి శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మరోవైపు, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి ఆయుర్వేద కాలేజీకి చెందిన వైద్యులు ఆనందయ్య తయారు చేసిన మందును వాడిన రోగుల నుండి డేటాను సేకరించారు.

ఇదిలావుంటే, నెల్లూరు ఆనందయ్య మందు తీసుకున్న వారు చాలా మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో 98 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. వారిలో 8 మంది బాధితులు.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆనందయ్య నాటుమందు పంపిణీ చేసిన మూడు రోజుల్లో.. జీజీహెచ్‌ నుంచి అధిక సంఖ్యలో కరోనా బాధితుల డిశ్చార్జ్ అయ్యారు. అయితే నాటుమందు పనిచేయకపోవడంతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారు బాధితులు.

ప్రస్తుతం హెడ్‌మాస్టర్‌ కోటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నెల్లూరు జీజీహెచ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డా.నరేంద్ర తెలిపారు. వైద్యానికి కోటయ్య సహకరిస్తున్నారన్నారు. ఆనందయ్య మందు తిన్న వారిలో కొందరికి.. కంటి సమస్యలు వచ్చిన మాట వాస్తవమే అయినా.. చిన్నపాటి సమస్యలు కావడంతో ప్రమాదమేమీ లేదన్నారాయన.

మరోవైపు, ఆనందయ్య తయారు చేసిన మందును వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మొద్దని సూచించారు. కరోనా సమయంలో వైద్యులు సూచించిన మందులే వాడాలని సూచించారు. ఆనందయ్య మందు వాడినవారు ఇబ్బందులు పడుతున్నారని, కరోనాతో జనాలు బతుకుతున్నది డాక్టర్ల మెడిసిన్ వాడటం వల్లేనంటున్నారు.

Read Also…  Monoclonal Injection: కరోనా రోగులకు అందుబాటులోకి వచ్చిన మరో చికిత్స.. ఒక్క ఇంజెక్షన్‌ చాలు.. కోవిడ్‌ పరార్‌!