AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Gogineni : “సస్తారురా ఒరేయ్!”… ఆనందయ్య మందుపై సంచలన కామెంట్స్ చేసిన బాబు గోగినేని

Babu Gogineni comments on Anandayya medicine : కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రంలా ఆనందయ్య కరోనా మందుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని వాడుతుంటుంటే,..

Babu Gogineni : సస్తారురా ఒరేయ్!... ఆనందయ్య మందుపై సంచలన కామెంట్స్ చేసిన బాబు గోగినేని
Babu Gogineni On Anandayya
Venkata Narayana
|

Updated on: May 28, 2021 | 9:30 AM

Share

Babu Gogineni comments on Anandayya medicine : కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రంలా ఆనందయ్య కరోనా మందుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని వాడుతుంటుంటే, బాబు గోగినేని మాత్రం ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. “పసరుతో ఆక్సిజన్ పెరగడమా.! ఇప్పుడేమైంది? హౌలేగాళ్లలారా..” అంటూ బాబు గోగినేని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలకు దిగిన సంగతి తెలిసిందే. కళ్లలో మందు వేయగానే తేరుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పరిస్థితి ఇప్పుడు మరింత అధ్వానంగా తయారైందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లలో పసరు వేస్తే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి?, ఆనందయ్య దుకాణం వెంటనే మూయించాలంటూ డిమాండ్ చేసిన బాబు గోగినేని ఇప్పుడు మళ్లీ “సస్తారురా ఒరేయ్!” అంటూ..  ఆనందయ్య మందుకు సంబంధించి చాట భారతమంత పోస్ట్ పెట్టారు. ఆయన ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్ట్ యథాతథంగా..

Babu Gogineni

Babu Gogineni

“సస్తారురా ఒరేయ్!
మళ్లీ చెప్తున్నాను. మళ్లీ మళ్లీ చెప్తాను. మీకు ఇష్టం లేకపోయినా చెప్తాను. మీ ఉన్మాదానికి దడిసేది లేదు. చంపుతాము అన్న బెదిరింపులే నాకు కొత్త కాదు, మీరు చంపడం మొదలు పెట్టినాకే నేను ఇండియా కు తిరిగి వచ్చాను, మీ బూతులు, మీ ఏడుపులు ఒక లెక్కా!
జాగ్రత్త, మీకు ప్రమాదం ఉంది ప్రాణాలకు ముప్పు ఉంటుంది అంటే, నా దేశం నా ధర్మం అని పెడబొబ్బలు ఏమిటి? చచ్చిపోతే పోయిన వారు నీ దేశం వాళ్ళు కాదా, నీ ధర్మం లోని వాళ్ళు కాదా?
గుర్తుంచుకోండి:
జ్ఞానం అజ్ఞానానికి లోంగదు.
వైరస్ మీ ఉన్మాదానికి తలవంచదు.
నమ్మకానికి పర్యవసానాలు ఉంటాయి.
అనందయ్యను నమ్మి మాస్క్ తీసేసిన వాడికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది. 100 లో 4 మాత్రమే కావచ్చు. కానీ ఆ నలుగురికి ఉన్నది ఆ ఒక్క ప్రాణమే. మహమ్మారి అంటే ఏమిటో అర్థం చేసుకోండి. సంవత్సరం పైగా ఈ విషయాలు చెప్తూనే ఉన్నాము.
హాస్పిటల్ బెడ్ ను వదిలేసి మరీ గుంపులుగా ఒకచోట గుమికూడి మీరు ఇతరులకు నష్టం కలగజేసారు. మీరు అంటే ఒక లక్ష మంది కాబోలు. అంటువ్యాధులు ప్రబలుతున్న కాలంలో ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరం. వంద మందితో నే అపారమైన నష్టం జరుగుతుంది. లక్షమంది తో?
మీ ఉన్మాదపు క్రీడల వల్ల ప్రజారోగ్య వ్యవస్థ, పబ్లిక్ హెల్త్ పాలసీ దెబ్బ తింటుంది. ముందు ముందు ఇటువంటి విపత్తు ఇంకొకటి వస్తే దానిని తట్టుకొగల శక్తి ఇంకా తగ్గి పోతుంది. ఇప్పటికే లోయ అంచులలో ఉన్నాము.
ఇది భారత దేశానికీ, పాశ్చాత్య దేశాలకు మధ్య యుద్ధం కాదు. ఇది అల్లోపతీ కీ ఇతరులకూ పోటీ కాదు. ఇది మనమందరం ఒక వైపూ, వైరస్ ఇంకొక వైపూ ఉండాల్సిన యుద్ధం. యుద్ధం అయ్యాక మోసం చేస్తున్న హాస్పిటల్స్ పని పట్టండి. ఇప్పుడు మాత్రం ప్రాణమే ముఖ్యం అని మర్చిపోవాకండి. మీరు జాగ్రత్త అంటే నీకు ఎవడు డబ్బులు ఇస్తున్నాడు అని అడిగే నీచానికి పాల్పడ వద్దు. అందరూ మీలాంటి బిఖారీలు కాదు.
డాక్టర్ మీద దాడి ఆపండి. వారు లేకపోతే మనలో చాలా మంది ఉండరు. చాలా మంది తప్పులు చేస్తుండవచ్చు – వైద్యం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పినప్పుడు ఇలాగే ఉంటుంది. అలా చేయవద్దు అని చెప్పిన వాళ్ళమే మేము. ఇప్పుడు మీకు మా శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
మీరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఏమీ కాకపోవచ్చు. కానీ మీ మాటలూ విని సంకోచం లేకుండా బయట తిరుగుతున్న వారు చాలా మంది ప్రమాదం తో చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళు కూడా మన వారే. వారిని కాపాడుకోవాలి అంటే సరైన సమాచారం వారికి అందాలి.
కృష్ణపట్నం లో కేసులు లేవు అన్న అబద్ధం నుండి పుట్టుకొచ్చిన ఉన్మాదం ఇది. తను చేసిన వంటకాన్ని మందు అని ఆనందయ్య అనడం వల్ల వచ్చిన అభిప్రాయం ఇది. నాకు బాగైంది అని కొంతమంది సాక్ష్యం చెప్పడం వల్ల ఏర్పడిన ప్రేయర్ ఆయిల్ విశ్వాసం ఇది. వైరస్ సోకిన తరువాత 14 రోజులకు సాధారణంగా నెగటివ్ వస్తుంది. ఎందుకంటే వైరస్ జీవిత కాలం అది. జలుబు లాగానే. 12 వ రోజు నెల్లూరు కి వచ్చి చట్నీ తిని రెండు రోజుల్లో నెగటివ్ అంటే అది దేనికీ రుజువు కాదు.
కృష్ణపట్నం కు వచ్చిన వాళ్ళు ఎక్కడనుండి వచ్చారో వివరాలు పోలీసులు సేకరించలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తిరిగి వెళ్ళి కొరోనా ను తమ కుటుంబ సభ్యులకూ, ఇతరులకూ వ్యాప్తి చేస్తూ ఉంటారు. వారి వారి బస్తీలలో కాలనీలలోకి ప్రమాదం తీసుకుని వెళ్లారు. వాళ్ళలో కొంతమంది చనిపోతారు, లేదూ ప్రమాదకరమైన పరిస్తితులలో హాస్పిటల్ లో జేరతారు. ఆనందయ్య ఉచిత వైద్యం కారణంగా లక్షలు ఖర్చు అవుతుంది. ఉచితం. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తూనే ఉన్నాను. ఉన్నాము.
ధైర్యం ఉంటే ప్రాణం ఉంటది అన్నది ఎంత నిజమో పక్కన పెట్టి అవసరం అయినప్పుడు నిజమైన మందు కూడా వాడాలి అని గుర్తు పెట్టుకోవడం కీలకం.
– ఆనందయ్య చేస్తున్నది ఆయుర్వేదము కాదు. ఆ విషయం ఆయుష్ కూడా చెప్పింది.
– ఆయుర్వేదం తనకు కరోనా లాంటి వైరస్ ను కట్టడి చేసే శక్తి ఉన్నదని ఎక్కడా నిరూపించలేదు. మూలికా వైద్యం కూడా కరోనా పై తన ప్రతాపం నిరూపించలేదు. Adjunct అంటే ప్రధానంగా ఆధునిక వైద్యం చేస్తూ ఉంటే ఇది లింబూ టింబూ అని అర్థం. దీనివల్ల చాత కాదు అని అర్ధం.
– దేశ ఉపరాష్ట్రపతి చెప్పినా ICMR రావడంలేదు అన్న విషయం గుర్తించండి.
– నిరూపణ అన్నది టీవీ ఛానల్ లో కానీ, తొడ కొడితే జరగదు.
– నువ్వు దేశం ధర్మం వేదం ఆయుర్వేదం అంటే కరోనా నిన్ను చూసి నవ్వుతది.
– ఇప్పటికైనా సరే, కృష్ణపట్నం వెళ్ళినవారు ఒక సారి టెస్ట్ చేయించుకుని అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. మీకు తెలిసిన వారు వెళ్ళి ఉంటే – వారికి దూరంగా ఉండండి.
కుంభ మేళా కారణంగా ఎంత మంది మీ మతస్తులు ప్రమాదానికి గురి అయ్యారు? అలాగే ఇక్కడా జరుగుతుంది. రాజకీయాలు కాదు ఇక్కడ. స్వీయ రక్షణ ముఖ్యం. సాటి మనుషుల ప్రాణాలకు విపత్తు కలిగించకుండా ఉండటం ముఖ్యం.
నేను మతస్తులకు వ్యతిరేకం కాదు. ఉన్మాదులకు మాత్రమే.
చదవండి. ప్రజాశక్తి, ఈ రోజు పత్రిక. ఇంకా ఎక్కువ వివరాలు ఎందుకు లేవు అంటే వచ్చినవారు ఎవరు అని వారి వివరాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది కాబట్టి. రెండవది ఈనాడు నుండి.
కమ్యూనిటీ లో వైరస్ ఉన్నంత కాలం అది రూపాంతరం చెందే ప్రమాదం ఉందని చూసాము. అలా మళ్లీ మళ్లీ జరిగితే ఇప్పటి వాక్సిన్ పరిధిలో అవి లేకపోతే ప్రమాదం ఏమిటో గ్రహించండి.”

Read also : Suravaram : ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి.. సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణవాది.. స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి శ్రీ సురవరం : సీఎం

Follow Us