నవంబర్ 26న ఏపీలో అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభం: మంత్రి సీదిరి అప్పలరాజు
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏర్పాటయ్యే 7,125 పాల సేకరణ కేంద్రాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే

Amul Project Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏర్పాటయ్యే 7,125 పాల సేకరణ కేంద్రాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఈ నెల 26న ప్రారంభం కానుందని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మూడు దశల్లో వీటిని నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. (Bigg Boss 4: జున్నును చూసి ఏడ్చేసిన లాస్య.. వీడు నీకంటే స్ట్రాంగ్ అన్న మంజునాథ్)
రాష్ట్రంలో 400 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని.. కానీ ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు 1.60 లక్షల లీటర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దీంతో 200 లక్షల లీటర్లకు పైగా పాలు మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వమే పాడి రైతుల నుంచి పాలు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఇందుకోసం మహిళా పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో ఆర్బీకేల పరిధిలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ క్రమంలో మొదటగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వీటి ద్వారా పాల కొనుగోలు ప్రారంభమవుతుందని వివరించారు. (Bigg Boss 4: మోనాల్‌పై అలిగిన అఖిల్.. ఇంటి నియమాలు పాటించని కొత్త కెప్టెన్)