సుజనా సార్..అంత సీన్ లేదు..రాజుగారి కౌంటర్

సుజనా చౌదరి టచ్‌ కామెంట్స్‌….ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని…సమయానుకూలంగా వారిని తమ పార్టీలో తీసుకుంటామంటూ ఎంపీ సుజనా చౌదరి ఈమధ్య  కామెంట్ చేశారు. దీనిపై టీడీపీ కాస్త సైలెంట్‌గా ఉన్నా…వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వైసీపీ నుంచి ఎవరూ వెళ్లరంటూ ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా సుజనాచౌదరి కామెంట్స్‌ను ఖండిస్తున్నారు.. బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీలు విమర్శల దాడి […]

సుజనా సార్..అంత సీన్ లేదు..రాజుగారి కౌంటర్
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2019 | 7:48 PM

సుజనా చౌదరి టచ్‌ కామెంట్స్‌….ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని…సమయానుకూలంగా వారిని తమ పార్టీలో తీసుకుంటామంటూ ఎంపీ సుజనా చౌదరి ఈమధ్య  కామెంట్ చేశారు. దీనిపై టీడీపీ కాస్త సైలెంట్‌గా ఉన్నా…వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వైసీపీ నుంచి ఎవరూ వెళ్లరంటూ ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా సుజనాచౌదరి కామెంట్స్‌ను ఖండిస్తున్నారు..

బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీలు విమర్శల దాడి పెంచారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ సుజనా చేసిన కామెంట్‌ వైసీపీలో ఆగ్రహాన్ని పెంచింది. సుజనా బీజేపీలో ఉండి.. టీడీపీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని విరుచుకుపడ్డారు. సుజనాతో టచ్‌లో ఉన్న ఒక ఎంపీ పేరు చెప్పాలని సవాల్‌ విసిరారు వైసీపీ ఎంపీలు.

వైసీపీలో ఎవరూ పార్టీ లైన్‌ దాటరని స్పష్టం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రధానమంత్రి మోడీకి విష్‌ చేయడంలో తప్పేముందన్న రఘురామ.. వ్యక్తిగతంగా కూడా ఆయనకు తాను తెలుసన్నారు. సుజనా చౌదరినే త్వరలో వైసీపీలో చేరతారుంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు.

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే టీడీపీ ఏదో ఒక అవాంతరం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. వైసీపీలో ఏ ఒక్కరు కూడా బీజేపీ నేతలతో టచ్‌లో లేరంటున్నారు. వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు మిథున్‌రెడ్డి. సుజనా చౌదరి రాష్ట్రానికి మేలు చేసేలా మాట్లాడలని.. వైసీపీ నేతలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. మొత్తానికి సుజనాచౌదరి కామెంట్స్‌ ఏపీలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. ఎవరు టచ్‌లో ఉన్నారు..ఎవరు కండువా మార్చబోతున్నారన్న అంశం…ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC