జగన్ సీఎం కావాలన్నదే అందరి ఆకాంక్ష
వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేయాలని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారంటూ గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని హిందూ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.