జగన్ మరో కీలక నిర్ణయం.. వారికి కూడా ‘వైఎస్సార్ చేయూత’

మహిళల జీవణ ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న వైఎస్సార్ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.

జగన్ మరో కీలక నిర్ణయం.. వారికి కూడా 'వైఎస్సార్ చేయూత'
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 8:20 AM

మహిళల జీవణ ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న వైఎస్సార్ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో పెన్షన్‌ని అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్య్సకార మహిళలకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం అందించాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం తన నిర్ణయాన్ని తెలిపారు. దీని వలన దాదాపు 8.21 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ది చేకూరబోతోంది.

కాగా మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారిని వైఎస్సార్ చేయూత ద్వారా ఆదుకుంటామని గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ నాలుగేళ్లలో రూ.75 వేలు అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ పథకం కోసం ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది.