ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..చికిత్సపై యాజమాన్యం కీలక ప్రకటన
ఏపీ ఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ఔదార్యం ప్రదర్శిస్తోంది. ఉద్యోగులకు చికిత్సపై ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైద్యం అందక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది.

ఏపీ ఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ఔదార్యం ప్రదర్శిస్తోంది. ఉద్యోగులకు చికిత్సపై ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైద్యం అందక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన యాజమాన్యం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఆమోదం తెలిపింది. ఉద్యోగి, కుటుంబ సభ్యుల వైద్యం ఖర్చు చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.