Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో ఆకలితో మరణించిన గిరిజన మహిళ

కరోనా కల్లోలానికి ఉన్న ఉపాథి కోల్పోయి నిర్భాగ్యులుగా మారుతున్నారు. కడుపు నిండా తిండికి నోచుకోక ప్రాణాలొదుతున్నారు. ఓ గిరిజన మహిళ ఆకలితో మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని నయాఘడ్ జిల్లాలో వెలుగుచూసింది.

ఒడిశాలో ఆకలితో మరణించిన గిరిజన మహిళ
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 15, 2020 | 7:14 PM

కరోనా కల్లోలానికి ఉన్న ఉపాథి కోల్పోయి నిర్భాగ్యులుగా మారుతున్నారు. కడుపు నిండా తిండికి నోచుకోక ప్రాణాలొదుతున్నారు. ఓ గిరిజన మహిళ ఆకలితో మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని నయాఘడ్ జిల్లాలో వెలుగుచూసింది.

నయాఘడ్ జిల్లాలోని కలియంబా గ్రామానికి చెందిన దుఖీ జానీ అనే 46 ఏళ్ల గిరిజన మహిళ జూన్ 24వతేదీన ఆహారం కోసం అడవిలోకి వెళ్లింది. ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తూ దుఖి జానీ అనే మహిళ అడవిలోనే కుప్పకూలి మరణించిందని అధికారులు తెలిపారు. గిరిజన మహిళ మృతిపై ఒడిశాకు చెందిన ఖాద్యా అధికార్ అభియాన్ కు చెందిన బృందం విచారణ చేపట్టింది. ఈ కమిటీ జరిపిన అధ్యయనంలో మానవ జాతి తలదించుకునే వాస్తవాలు బయటపడ్డాయి. కనీసం ఓ ఒంటరి మహిళకు పూట అన్నం పెట్టేలేని సమాజంలో ఆమె బతికినట్లు నిర్ధారణకు వచ్చారు.

ఈ నెల మొదటివారంలో కలియంబా గ్రామాన్ని ఖాద్యా అధికార్ అభియాన్ కు చెందిన బృందం సందర్శించగా ఆకలితో దుఖీజానీ చనిపోయినట్లు తేలింది. దుఖి జానీ మరణించే ముందు మూడు రోజులుగా ఆమె తినేందుకు తిండి లేక మరణించినట్లు పరిశీలనలో వెల్లడైంది. ఆకలితో చనిపోయిన జానీ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు డబ్బుల్లేక ఆమెను గ్రామస్థులు ఖననం చేశారు.

కలియంబా గ్రామానికి చెందిన దుఖీ జానీ అటవీ ఉత్పత్తులు అమ్ముకుంటూ కాలం వెల్లదీస్తోంది. కొన్నేళ్ల క్రితం భర్త వదిలేయడంతో ఒంటరిగా నివాసముంటుంది. దుఖీ జానీకి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో ఆమె అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడింది. ఆమెకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలకు సైతం నోచుకోలేదని, కనీసం సబ్సిడీ బియ్యం కూడా అందలేదని ఆహార హక్కుల ఫోరం సభ్యుడు సమీత్ పాండా చెప్పారు.

మృతురాలు దుఖీజానీకి అన్నపూర్ణ కార్డు ఉన్నప్పటికీ ఆమెకు చివరిసారిగా 2018లో బియ్యం దక్కింది. 2018 నవంబరు నుంచి ఆమెకు ఉచిత రేషన్ లేకుండా పోయింది. ఒంటరి మహిళ పెన్షన్ కోసం పంచాయతీ, బ్లాక్ అధకారులకు దరఖాస్తు చేసుకున్నా రాలేదని తేలింది. ఆకలితో అల్లాడుతూ మరణించిన గిరిజన మహిళకు ఉపాధి హామి పథకం జాబ్ కార్డు లేదని, ఆమెకు లాక్ డౌన్ సమయంలో జనధన్ మద్ధతు కూడా లభించలేదు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇచ్చే బియ్యం, పప్పులు కూడా ఆమెకు అందలేదు. లాక్ డౌన్ కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో ఆకలి తీర్చుకునేందుకు మార్గం లేకుండా పోయింది.

అయితే, మహిళను చేరదీసిన గ్రామ పంచాయతీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లాక్ డౌన్ ప్రారంభంలో కొన్నిరోజులు ఆహారం పెట్టారని అంగన్ వాడీ కార్మికురాలు బసంతి చెప్పారు. అది కాస్తా ఆగిపోవడంతో దుఖికి ఎవరి నుంచి సాయం అందలేదు. దీంతో అటవీ ప్రాంతంలోని ఉత్పత్తులను సేకరించి విక్రయించి అమ్మగా వచ్చిన సొమ్ముతో కొంతకాలం కడుపు నింపుకుంది. ఇదే క్రమంలో గత వారం ఆడవిలోకి వెళ్లింది. మూడు రోజులుగా తిండి తిప్పలు లేకపోవడంతో ఆకలితో చనిపోయినట్లు కమిటీ జరిపిన పరిశీలనలో వెల్లడైంది. కరోనా సంక్షోభ సమయంలో గిరిజన మహిళ ఆకలి చావు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. కరోనాతో ఆకలి కేకలు వినిపించకుండా పేదలందరికీ అదనంగా మరో 5 కిలోల నిత్యావసరాలను అందించాలని సోనియా గాందీ డిమాండ్ చేశారు.