Volunteers in AP: వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..!
YCP MLA comments on Volunteers: ఏపీలోని గ్రామ/ వార్డు వాలంటీర్లపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(YSRCP MLA Bala Nagi Reddy) సంచలన ఆరోపణలు చేశారు. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తోన్న గ్రామ వాలంటీర్లు వాటిని నేతలకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని.. డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్(YS […]
YCP MLA comments on Volunteers: ఏపీలోని గ్రామ/ వార్డు వాలంటీర్లపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(YSRCP MLA Bala Nagi Reddy) సంచలన ఆరోపణలు చేశారు. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తోన్న గ్రామ వాలంటీర్లు వాటిని నేతలకు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని.. డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) ప్రభుత్వం గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక్కొక్కరి చొప్పున.. మొత్తం 4లక్షల మంది గ్రామ/ వార్డు వాలంటీర్లుగా ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.5వేల గౌరవ వేతనం కూడా అందిస్తోంది. కానీ కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పొందే లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి ఆరోపణల క్రమంలోనే కొంతమందిని వాలంటీర్లుగా తప్పించారు కూడా. కానీ ఇప్పుడు వారు వసూలు చేసే డబ్బులు నేతలకు ఇస్తున్నారంటూ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపుతోంది.