ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వినియాగం.. జ్ఞాపకశక్తిపై ప్రభావం.. 

TV9 Telugu

07 January 2025

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్‌ అనేదీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు.

ఒక్క క్షణం ఫోన్‌ లేని లైఫ్‌ని ఊహించలేకపోతున్నారు. అన్నం తిన్నా ఫోన్ ఉండాల్సిందే..! స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల మనషు జ్ఞాపకశక్తిని చంపేస్తోందని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

తరచూ ఫోను చూసుకుంటూ ఉండటం, ప్రతి చిన్న విషయానికి ఫోన్‌పై ఆధారపడటం.. వంటి అలవాట్లు మన మెదడుపై ప్రభావం చూపుతున్నాయట.

అమెరికన్లు స్మార్ట్ ఫోన్‌ను సగటున రోజుకు 344 సార్లు అంటే ప్రతి 4 నిమిషాలకు ఒకసారి చూస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.

అవసరం ఉన్నా.. లేకపోయినా యథాలాపంగా ఫోన్‌ చూస్తూ ఉండిపోవాలని ఎక్కువగా అనిపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

సౌండ్ లేకున్నా.. పదే పదే ఫోన్‌ చెక్ చేయడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం వంటివి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ ఫోన్‌ ఎప్పుడు మీ పక్కనే పట్టుకుని చూస్తుంటే మెదడు చురుకుదనం తగ్గిపోతుందంటున్నారు స్పెషలిస్టులు.

ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లపై ఆధారపడటం వలన ప్రతి ఒక్కరిలోనూ జ్ఞాపకశక్తి క్షీణిస్తుందంటున్నారు వైద్యులు.

రోజులో ఎంత వీలైతే అంత తక్కువగా మొబైల్ ఫోన్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.