ఆకలితో ఏది పడితే అది తింటే దిన దిన గండమే.. 

TV9 Telugu

07 January 2025

అనారోగ్యకరమైన చిరుతిండ్లు కడుపులో పడేయడం వల్ల పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నదని వైద్య పరిశోధకులు తేల్చేశారు.

ప్రాసెస్‌ చేసిన, చక్కెరలు ఎక్కువగా ఉన్న చిరుతిండ్లకు అలవాటు పడిపోవడం అంటేనే చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు.

అనారోగ్యకరమైన చిరు తిండ్ల వల్ల అధిక బరువును సూచించే బాడీ మాస్‌ ఇండెక్స్‌ అమాంతం పెరిగిపోతుండటాన్ని గుర్తించారు.

శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడానికి కూడా అనారోగ్యకరమైన చిరుతిండ్లు లాగించేయడమే కారణం అంటున్నారు నిపుణులు.

రక్తంలో అధిక చక్కెర స్థాయుల మూలంగా వచ్చే పక్షవాతం, గుండె వ్యాధులు, ఊబకాయం తదితర సమస్యలు కూడా చిరుతిండ్లకు సంబంధం ఉందని నిర్ధారించారు.

అనారోగ్యకరమైన చిరుతిండ్ల బదులు గింజలు, తాజాపండ్లు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తినడం వల్ల జీవక్రియ సాఫీగా ఉంటుంది.

కేకులు, బిస్కెట్లు, చిప్స్‌ వంటి అనారోగ్యకరమైన చిరుతిండ్ల నుంచి పండ్లు, గింజల వైపు జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.

మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్‌ చేస్తుందన్నమాట. ప్రొటీన్లు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఇంట్లో ఉంచుకుంటే మరింత మంచిది.