జీలకర్రతో ఇలా తీసుకొంటే చాలు.. అజీర్తి, గ్యాస్ సమస్య దూరం..
TV9 Telugu
07 January
202
5
అజీర్తి, గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ వంటింటి చిట్కాతో మీ సమస్య మాయం. ఏంటో తెలుసుకుందాం.
వంటింట్లోని పోపు డబ్బాలో కనిపించే జీలకర్ర ద్వారా వంటకాలకే కాదు.. వంటికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పప్పు కూరలు, రైతాలు, సూప్స్ సహా ఎన్నో డిష్‌లలో జీలకర్రను వాడటం ద్వారా ఆయా వంటకాల రుచే మారిపోతుంటుంది.
జీలకర్రలో రుచి పరంగానే కాకుండా జీర్ణక్రియను పెంపొందించే గుణాలు అనేకం ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.
ఇంట్లో పెద్దవారు గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి సాంత్వన పొందడానికి జీలకర్ర, బ్లాక్‌సాల్ట్‌ను కలిపి తాగుతుంటారు.
భోజనం చేసిన తర్వాత జీలకర్రతో చేసిన గోళీలను చప్పరిస్తే గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలు రావని అంటున్నారు.
జీరా పచక్ గోళీగా పిలిచే ఈ పిల్‌ను ఆహారం భుజించిన తర్వాత రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు కూడా జీలకర్ర నీటిని తాగుతుంటారు. కడుపు నొప్పి, అజీర్తి, డయేరియా వంటి సమస్యలను జీరా పానీయం నయం చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ ఎలా పొందాలి..?
డ్యాన్స్ చేస్తే ఎన్ని లాభాలో మీకు తెలుసా.?
రాత్రిపూట స్నానం చేస్తున్నారా.? ఇది మీ కోసమే..