AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలకు వెళ్తుండగా వధూవరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.. కట్ చేస్తే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని సీన్ ఎదురయ్యింది.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అసలేం జరిగిందంటే..

తిరుమలకు వెళ్తుండగా వధూవరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే..
Tirupati News
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2024 | 12:41 PM

Share

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.. కట్ చేస్తే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని సీన్ ఎదురయ్యింది.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అసలేం జరిగిందంటే.. విజయవాడకు చెందిన ఓ ప్రేమ జంటను శుక్రవారం తిరుచానూరు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాంబశివరావు, అలేఖ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఇద్దరూ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు.. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు.

అలేఖ్య ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. సాంబశివరావు, అలేఖ్య ఒక్కచోటనే ఉన్నారన్న విషయం తెలిసింది. వారు.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నట్లు భవానీపురం పోలీసులకు సమాచారం అందింది.. వెంటనే.. భవానీపురం పోలీసులు తిరుచానూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇద్దరి గురించి సమాచారం అందించారు.. వాహనంలో అలేఖ్య, సాంబశివరావు ఇద్దరూ వస్తుండగా పోలీసులు తిరుచానూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా.. తాము ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు అలేఖ్య సాంబశివరావు తెలిపారు. తాము ఇద్దరం 11 ఏళ్లుగా ప్రేమించుకున్నట్లు అలేఖ్య తెలిపింది.. మేజర్లమైన తాము ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, పోలీసులు రక్షణ కల్పించాలంటూ కోరారు..

తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. వీరిద్దరిని భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా.. నూతన వధూవరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..