మీడియాకు క్షమాపణ చెప్పిన రాజధాని రైతులు
మీడియాపై దాడి ఘటన దురదృష్టకరమన్నారు వెలగపూడి రైతులు. క్షణికావేశంలో జరిగిన ఈ సంఘటనకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు రైతులు. ఉద్యమాలు చేయడం తమకు తెలియదని.. అయితే రోడ్డెక్కి ఆందోళనలు చేయడం ఇదే తొలిసారి అన్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తొందరపడి.. దాడికి పాల్పడ్డారని.. ఇందుకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నామన్నారు వెలగపూడి రైతులు. ఇక ముందు శాంతియుతంగానే తమ నిరసనలు తెల్పుతామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెలుగపూడి రైతులు స్పష్టం చేశారు. కాగా, […]
మీడియాపై దాడి ఘటన దురదృష్టకరమన్నారు వెలగపూడి రైతులు. క్షణికావేశంలో జరిగిన ఈ సంఘటనకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు రైతులు. ఉద్యమాలు చేయడం తమకు తెలియదని.. అయితే రోడ్డెక్కి ఆందోళనలు చేయడం ఇదే తొలిసారి అన్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తొందరపడి.. దాడికి పాల్పడ్డారని.. ఇందుకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నామన్నారు వెలగపూడి రైతులు. ఇక ముందు శాంతియుతంగానే తమ నిరసనలు తెల్పుతామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెలుగపూడి రైతులు స్పష్టం చేశారు.
కాగా, రాజధాని ఆందోళనల్లో భాగంగా.. మూడు రోజుల క్రితం గుంటూరు వెలగపూడి ప్రాంతంలో మీడియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇక.. మీడియాపై దాడికి రైతులు క్షమాపణ చెప్పడం మంచి పరిణామం అన్నారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. ఈ సంఘటనతో ఎవరికి సంబంధం ఉందన్న విషయం పక్కన పెడితే.. రైతులు సహృదయంతో క్షమాపణ చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.