సీఎం రమేష్ ఇంట విషాదం.. సోదరుడి అకాల మరణం!

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సీఎం ప్రకాష్(51) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. సీఎం ప్రకాష్ అకాల మరణంతో రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ కడప జిల్లా పొట్లదుర్తిలో సీఎం ప్రకాష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సీఎం రమేష్ ఇంట […]

సీఎం రమేష్ ఇంట విషాదం.. సోదరుడి అకాల మరణం!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 31, 2019 | 6:33 AM

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సీఎం ప్రకాష్(51) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. సీఎం ప్రకాష్ అకాల మరణంతో రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవాళ కడప జిల్లా పొట్లదుర్తిలో సీఎం ప్రకాష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సీఎం రమేష్ ఇంట ఈ ఒక్క సంవత్సరంలోనే రెండు విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో కుటుంబం ఆవేదనలో కూరుకుపోయింది. గతంలో ఆయన మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు అపార్ట్మెంట్ ఏడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.