చంద్రబాబు ఆరోపణలపై మండిపడ్డ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి

టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది టీటీడీ బోర్డు. ఎస్వీబీసీ ఛానెల్ లో లైంగిక వేధింపులు సహా చంద్రబాబు చేసిన ఆరోపణలన్నింటిపైనా...

చంద్రబాబు ఆరోపణలపై మండిపడ్డ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 18, 2020 | 8:03 PM

టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది టీటీడీ బోర్డు. ఎస్వీబీసీ ఛానెల్ లో లైంగిక వేధింపులు సహా చంద్రబాబు చేసిన ఆరోపణలన్నింటిపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అదే క్రమంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం వ్యాఖ్యలను సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం అంటూ ప్రచారం చేశారని కానీ ఆ టికెట్లు గత ప్రభుత్వ హయాంలో ముద్రించినవేనన్నారు. విశాఖ శారదా పీఠానికి టీటీడీ నిధులు ఇస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు సుబ్బారెడ్డి. ఈ సంప్రదాయం చాలా ఏళ్ళ నుంచి కొనసాగుతోందని చెప్పారు. లోకకల్యాణం కోసం శారదా పీఠం యాగం చేస్తుంటే డబ్బు ఇచ్చామన్నారు. టీడీపీ హయాంలో కూడా ఈ విధంగా శారదా పీఠానికి నిధులు ఇచ్చారని చెప్పారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో గతంలో అనేక సార్లు క్లారిటీ ఇచ్చామని అయినా సరే పదే పదే అదే అంశాన్ని లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.