బీజేపీతో పెట్టుకుంటే అంతే సంగతి, ఏపీ సర్కారుకి విష్ణువర్ధన్ రెడ్డి వార్నింగ్

బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్..

  • Anil kumar poka
  • Publish Date - 9:07 pm, Fri, 18 September 20
బీజేపీతో పెట్టుకుంటే అంతే సంగతి, ఏపీ సర్కారుకి విష్ణువర్ధన్ రెడ్డి వార్నింగ్

బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన అన్ని దాడులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ శుక్రవారం పిలుపునిచ్చిన ‘ఛలో అమలాపురం’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అమలాపురంకు చేరుకున్న విష్ణువర్థన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తనను దాదాపు 20 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. అనంతరం తనను గుడివాడకు తీసుకొచ్చారని ఆయన చెప్పారు. గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసి, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసులపై భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏలూరు రేంజ్ డీఐజీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, అమలాపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.