కరోనా వైద్యంలో ఎక్కడా ఏలోటు రాకూడదు : సీఎం జగన్
కరోనా వైద్య సేవలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా ఏ లోటు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని ప్రమాణాలు ఉండాలని, ఆయా ఆస్పత్రుల గ్రేడింగ్ కూడా పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు.
కరోనా వైద్య సేవలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా ఏ లోటు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని ప్రమాణాలు ఉండాలని, ఆయా ఆస్పత్రుల గ్రేడింగ్ కూడా పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఐవీఆర్‌ఎస్ ప్రశ్నల్లో మరింత స్పష్టత రావాలన్న సీఎం.. వైద్య సేవలు, శానిటేషన్‌పై ప్రశ్నలు మారాలని సూచించారు. కోవిడ్ – 19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ అమలుపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయన్న సీఎం.. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఉందన్నారు. ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంచామని.. సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు ఇస్తామని చెప్పారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పూర్తి సదుపాయాలు ఉండాలని.. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథక సమన్వయ బాధ్యతలు జేసీకి ఉంటాయని సీఎం అన్నారు. మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్ కోడ్ కార్డులు రూపొందించాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు.