వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!

ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎంపీ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన వారసుడిని కూడా వెంట బెట్టుకొని వెళ్లిన ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన బర్త్ డే కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, […]

వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2019 | 5:14 PM

ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎంపీ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన వారసుడిని కూడా వెంట బెట్టుకొని వెళ్లిన ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన బర్త్ డే కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఇక ఇదే వేడుకలకు చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్‌తో హాజరయ్యారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాదు ఎంపీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రసంగించారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. కరణం టీడీపీని వీడి.. వైసీపీలో చేరబోతున్నాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వేడుకలకు బలరాం వెళ్లడం వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు మాగుంట టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారని.. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారని.. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ వేడుకలకు హాజరయ్యారని చెబుతున్నారు. అంతేకాదు కరణం ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరని ఆయన సన్నిహితులు కుండ బద్దలుగొడుతున్నారు.

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్