కేంద్రానికి, ఏపీకి మధ్య మళ్ళీ ‘ పీపీఏ ‘ ల తంటా !
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (పీపీఏ) విషయంలో కేంద్రానికి, ఏపీకి మధ్య మళ్ళీ వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కేంద్రానిది ఓ దారి అయితే.. ఏపీ ప్రభుత్వానిది మరో దారి అవుతోంది. వివిధ ఇంధన ఒప్పందాల కింద కుదిరిన కాంట్రాక్టు సంబంధిత ఒడంబడికలను ప్రభుత్వం ‘ గౌరవిస్తుందని ‘ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా స్పష్టం చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ఒప్పందాల విషయంలో […]
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (పీపీఏ) విషయంలో కేంద్రానికి, ఏపీకి మధ్య మళ్ళీ వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కేంద్రానిది ఓ దారి అయితే.. ఏపీ ప్రభుత్వానిది మరో దారి అవుతోంది. వివిధ ఇంధన ఒప్పందాల కింద కుదిరిన కాంట్రాక్టు సంబంధిత ఒడంబడికలను ప్రభుత్వం ‘ గౌరవిస్తుందని ‘ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా స్పష్టం చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ఒప్పందాల విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అగ్రిమెంట్లను ఈ దేశ ‘ లక్ష్యం ‘ గా గౌరవించాలి.. ఒప్పందాలపై ఇప్పటికే అవగాహనకు వఛ్చినవారో, లేక ఇదివరకే ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లో చాలా ఆసక్తిగా ఉంటారు. ఇండియాలో ఎనర్జీ, ఎనర్జీ సెక్యూరిటీ అన్నవి ముఖ్యాంశాలు ‘ అన్నారామె. (ఢిల్లీలో జరిగిన ‘ ఇండియా ఎనర్జీ ఫోరమ్ ఆఫ్ సెరా వీక్ లో నిర్మల పాల్గొన్నారు). ఇలాంటి అగ్రిమెంట్ల విషయంలో అనిశ్చితి ఏర్పడిందని, కానీ ‘ కమిట్ మెంట్లను ‘ తప్పనిసరిగా పాటించాల్సి ఉందని అన్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం.. నోడల్ ఏజన్సీలైన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ సంస్థలను తమ రెనివబుల్ ఇంధన ప్రాజెక్టుల టారిఫ్ ను తగ్గించుకోవలసిందిగా కోరింది. పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ల కింద ఈ సంస్థలు వేలంలో తమ టారిఫ్ లను పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం అత్యధిక టారిఫ్ లతో ఒడంబడికలు కుదుర్చుకున్నదని ఆ మధ్య ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. అన్ని విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అప్పట్లోనే… పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పీపీఏలను తిరగదోడరాదని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. 20022 నాటికి 175 గెగావాట్ల రెనివబుల్ ప్రాజెక్టులను సాధించాలన్నది కేంద్ర లక్ష్యం. అందువల్ల వచ్ఛే మూడేళ్ళలో ఈ టార్గెట్ చేరుకోవాలంటే ఇండియాకు భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన నిర్మలాసీతారామన్.. రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ని సరళతరం చేయడమే గాక.. ఏపీలో వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ఈ సమస్యపై కేంద్రం వైఖరి ఒకలా ఉండగా.. ఏపీ వైఖరి మరొకలా ఉండడంతో ఈ ప్రాజెక్టుల భవితవ్యం ఎలా ఉంటుందో చూడాల్సిందేనని అంటున్నారు.