ఆర్టీసీ సమ్మె.. కోర్టు ఏం చెబుతోంది..?

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాజాగా స్పందించిన హైకోర్టు.. కార్మికులు తక్షణం సమ్మె విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వానికి.. కార్మికులకు మధ్య సామాన్య ప్రజలు నలుగుతున్నారని.. కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ సమ్మె కారణంగా.. విద్యార్థులకు ఈ నెల 20వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. సమ్మెపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. నిరసనలను తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. కాగా.. ఆర్టీసీ పూర్తి స్థాయి ఎండీని నియమించాలని […]

ఆర్టీసీ సమ్మె.. కోర్టు ఏం చెబుతోంది..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 15, 2019 | 5:20 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాజాగా స్పందించిన హైకోర్టు.. కార్మికులు తక్షణం సమ్మె విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వానికి.. కార్మికులకు మధ్య సామాన్య ప్రజలు నలుగుతున్నారని.. కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ సమ్మె కారణంగా.. విద్యార్థులకు ఈ నెల 20వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. సమ్మెపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. నిరసనలను తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

కాగా.. ఆర్టీసీ పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అలాగే.. రెండు రోజుల్లో ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులతో చర్చలు పూర్తి చేసి రిపోర్ట్ సమర్పించాలని కూడా.. కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఇంకా హైకోర్టు ఏం చెప్పిందంటే:

1. కార్మికులు ఎవ్వరు ఆత్మహత్య లకు పాలపడొద్దన్న హైకోర్టు 2. కార్మికులు ఎవ్వరు తొందర పడవద్దన్న హైకోర్టు 3. వెంటనే చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశం 4. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కార్మికల తో చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశం 5. రవాణా వ్యవస్థ సరిగా లేకుంటే తెలంగాణ కు పెట్టబడుల ఎలా వస్తాయన్న హైకోర్టు