తిరుపతికి శివప్రసాద్ భౌతిక కాయం.. ఈ రోజే అంత్యక్రియలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతిక కాయాన్ని చెన్నై నుంచి తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఆయన పార్ధివ దేహం ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసంలో ఉంచగా.. కడసారి ఆయనను చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం చంద్రగిరి మండలం అగరాలలో జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతిలోని స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. చంద్రబాబు, నారా లోకేష్ హాజరుకానున్నారు. అయితే ప్రజానాయకుడిగా, సినీ నటుడిగా గుర్తింపు […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:34 am, Sun, 22 September 19
తిరుపతికి శివప్రసాద్ భౌతిక కాయం.. ఈ రోజే అంత్యక్రియలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతిక కాయాన్ని చెన్నై నుంచి తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఆయన పార్ధివ దేహం ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసంలో ఉంచగా.. కడసారి ఆయనను చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం చంద్రగిరి మండలం అగరాలలో జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతిలోని స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. చంద్రబాబు, నారా లోకేష్ హాజరుకానున్నారు. అయితే ప్రజానాయకుడిగా, సినీ నటుడిగా గుర్తింపు పొందిన శివప్రసాద్.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయనను చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇక ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే శనివారం మధ్యాహ్నం 2:10గం.కి ఆయన కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతితో టీడీపీ మరో గొప్ప నేతను కోల్పోయింది.