వరుస మరణాలు.. టీడీపీలో గుబులు..!

వరుస మరణాలు.. టీడీపీలో గుబులు..!

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే శివప్రసాద్ హఠాన్మరణం చెందారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం పార్టీకి తీరని లోటని చెబుతున్నారు. అయితే టీడీపీ అధికారం కోల్పోయినప్పుడే ఇలా జరుగుతోందని కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. అప్పుడు కూడా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 21, 2019 | 9:46 PM

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే శివప్రసాద్ హఠాన్మరణం చెందారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం పార్టీకి తీరని లోటని చెబుతున్నారు. అయితే టీడీపీ అధికారం కోల్పోయినప్పుడే ఇలా జరుగుతోందని కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు.

2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. అప్పుడు కూడా ఇలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు వివిధ కారణాలతో చనిపోయారు. మళ్లీ ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయిందని కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు. 2004లో టీడీపీ అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే టీడీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పరిటాల రవి దారుణ హత్యకు గురయ్యారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక విషయమై పార్టీ నేతలతో చర్చిస్తుండగా.. ప్రత్యర్థులు పార్టీ కార్యాలయంలోనే పరిటాల రవిని దారుణంగా కాల్చి చంపేశారు. అయితే ఈ ఘటనకు ముందే తనపై దాడి జరిగే అవకాశం ఉందని రవి పలుమార్లు చెప్పారు. రాయలసీమలో మంచి పట్టు ఉన్న నేత పరిటాల.. ఆయన మరణం టీడీపీకి పెద్ద లోటు అని చెప్పొచ్చు. తర్వాత మరో పార్టీ సీనియర్ దామచర్ల ఆంజనేయులు అనారోగ్య కారణంతో కన్నుమూశారు. ఈ రెండు ఘటనలు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జరిగాయి.

ఇక 2009 ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటమి తప్పలేదు. వరుసగా రెండోసారి చంద్రబాబు ఓడిపోయారు. కాగా, 2012లో శ్రీకాకుళం ఎంపీ, పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు అకాల మరణం పొందారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే.. 2013లో మరో సీనియర్ నేత లాల్‌జాన్ బాషా కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో స్పాట్ లోనే కన్నుమూశారు. ఇలా వరుసగా రెండు విషాదాలు టీడీపీని వెంటాడాయి. తాజాగా కోడెల శివప్రసాదరావు, మాజీ ఎంపీ శివప్రసాద్ మరణాలు కూడా పార్టీని విషాదంలో నెట్టేశాయి.

రెండు సంవత్సరాల్లో ఐదురుగు సీనియర్లు మృతి..

ఇక 2017 నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఐదుగురు టీడీపీ నేతలు చనిపోయారు. 2017లో నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఆయన.. తర్వాత టీడీపీలో చేరారు.

2018లో పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కూడా కన్నుమూశారు. ఆ విషాదాన్ని మరువక ముందే ఆరు నెలల తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, నటుడు నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఎక్కువమంది టీడీపీ నేతలు చనిపోయారు. ఇక ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం కారణాలతోనే మృతి చెందారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu