AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్.. రాజీనామా చేద్దామంటూ YSRCPకి చంద్రబాబు ఛాలెంజ్

AP Special Status: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు.

Chandrababu Naidu: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్.. రాజీనామా చేద్దామంటూ YSRCPకి చంద్రబాబు ఛాలెంజ్
Chandrababu Naidu
Janardhan Veluru
|

Updated on: Dec 11, 2021 | 3:36 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసేందుకు ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు. ఈ విషయంలో వైసీపీ మాయ మాటలు, సన్నాయి నొక్కులు మానుకుని సూటిగా స్పందించాలన్నారు. రెండు పార్టీల ఎంపీలూ రాజీనామా చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుదామంటూ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం ఇటీవల ప్రకటించిందని గుర్తు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడుతారంటూ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని.. లేని పక్షంలో పదవులకు రాజీనామా చేస్తామని గతంలో జగన్ చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు హోదా సాధించలేకపోయారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది ప్రజలను మోసగించడం.. దగా చేయడం కాదా? అని  ప్రశ్నించారు. విభజన హామీలను సాధించడంలోనూ జగన్ సర్కారు ఘోరంగా విఫలం చెందిందన్నారు.

వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి.. ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని విషయాల్లోనూ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. జగన్ సర్కారుపై రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందన్నారు. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా వస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పాలించే హక్కు వైసీపీ కోల్పోయిందన్నారు.

ఓటీఎస్ విషయంలో తాము వదిలిపెట్టేది లేదని చంద్రబాబు అన్నారు. ఇళ్ల పట్టాలని రిజిస్ట్రార్ రిజిస్ట్రేయాల్ చేయాలి తప్ప.. ఎవరుపడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరూ డబ్బులు కట్టవద్దు.. తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.

Also Read..

Andhra Pradesh: జగన్‌ను హతమార్చే కుట్ర జరుగుతోంది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

PM Modi: భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని మోడీ పెద్ద పీట.. పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం..