నూతన ఎమ్మెల్యేలకు రేపట్నుంచి ట్రైనింగ్ క్లాసెస్

ఏపీ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు.  వారందరికి  రేపట్నుంచి రెండ్రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. సభా నియమాలు, హక్కులు, బాధ్యతలు, సంప్రదాయాలపై వివిధ రంగాల నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు.  ప్రస్తుత అసెంబ్లీలో 100మందికి పైగా నూతనంగా ఉన్న ఎమ్యెల్యేలు ఉంటారని అంచనా వేస్తున్నారు. వారందరికీ శిక్షణ ఇవ్వడం ద్వారా సభా గౌరవం పెరగడంతో పాటు..క్వాలిటీ చర్చలకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.  ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చక్కని వేదికన్న […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:47 pm, Tue, 2 July 19
నూతన ఎమ్మెల్యేలకు రేపట్నుంచి ట్రైనింగ్ క్లాసెస్

ఏపీ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు.  వారందరికి  రేపట్నుంచి రెండ్రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. సభా నియమాలు, హక్కులు, బాధ్యతలు, సంప్రదాయాలపై వివిధ రంగాల నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు.  ప్రస్తుత అసెంబ్లీలో 100మందికి పైగా నూతనంగా ఉన్న ఎమ్యెల్యేలు ఉంటారని అంచనా వేస్తున్నారు. వారందరికీ శిక్షణ ఇవ్వడం ద్వారా సభా గౌరవం పెరగడంతో పాటు..క్వాలిటీ చర్చలకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.  ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చక్కని వేదికన్న తమ్మినేని సీతారాం.. శాసనసభ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.