AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Boosters: గరుడ పురాణం ప్రకారం పాటించాల్సిన పవర్ ఫుల్ సక్సెస్ ట్రిక్స్

Garuda Purana Success Secrets: గరుడ పురాణం ప్రత్యేకత ఏమిటంటే, ఇది మరణం తర్వాత ఏమి జరుగుతుందో మాత్రమే కాకుండా, మన జీవితాన్ని సార్థకంగా ఎలా మార్చుకోవాలో కూడా సూచిస్తుంది. ఈ పురాణం ప్రకారం కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటిస్తే మన జీవితంలో విజయాన్ని సాధించడం సులభమవుతుంది. ఈ సుత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 08, 2026 | 10:25 AM

Share
గరుడ పురాణం (Garuda Purana) హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన,. ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఈ పురాణం మనిషి జీవితం, జననం, మరణం, మరణానంతర జీవితం, ఆత్మ పరివర్తన గురించి వివరిస్తుంది. జీవితం ఎలా గడపాలి, ఎలా ఎదగాలి, ఎలా విజయాన్ని సాధించాలి అనే విషయాలపై కూడా ఇందులో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి.  గరుడ పురాణం ప్రత్యేకత ఏమిటంటే, ఇది మరణం తర్వాత ఏమి జరుగుతుందో మాత్రమే కాకుండా, మన జీవితాన్ని సార్థకంగా ఎలా మార్చుకోవాలో కూడా సూచిస్తుంది. ఈ పురాణం ప్రకారం కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటిస్తే మన జీవితంలో విజయాన్ని సాధించడం సులభమవుతుంది.

గరుడ పురాణం (Garuda Purana) హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన,. ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఈ పురాణం మనిషి జీవితం, జననం, మరణం, మరణానంతర జీవితం, ఆత్మ పరివర్తన గురించి వివరిస్తుంది. జీవితం ఎలా గడపాలి, ఎలా ఎదగాలి, ఎలా విజయాన్ని సాధించాలి అనే విషయాలపై కూడా ఇందులో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రత్యేకత ఏమిటంటే, ఇది మరణం తర్వాత ఏమి జరుగుతుందో మాత్రమే కాకుండా, మన జీవితాన్ని సార్థకంగా ఎలా మార్చుకోవాలో కూడా సూచిస్తుంది. ఈ పురాణం ప్రకారం కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటిస్తే మన జీవితంలో విజయాన్ని సాధించడం సులభమవుతుంది.

1 / 5

 శత్రువులను ఎదుర్కొనే తెలివి, ఓర్పు.. 

గరుడ పురాణం ప్రకారం మన శత్రువులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. వారిని ఓడించడానికి తెలివితేటలు, ఓర్పు చాలా అవసరం.  
శత్రువులు మనకు హాని చేయడానికి వ్యూహాలతో ముందుకు వస్తే, మనం కూడా వాటిని అర్థం చేసుకుని తెలివిగా ఎదుర్కోవాలి. వారి కదలికలను గమనించి సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థితి,  విజయం సాధించవచ్చు.

శత్రువులను ఎదుర్కొనే తెలివి, ఓర్పు.. గరుడ పురాణం ప్రకారం మన శత్రువులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. వారిని ఓడించడానికి తెలివితేటలు, ఓర్పు చాలా అవసరం. శత్రువులు మనకు హాని చేయడానికి వ్యూహాలతో ముందుకు వస్తే, మనం కూడా వాటిని అర్థం చేసుకుని తెలివిగా ఎదుర్కోవాలి. వారి కదలికలను గమనించి సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థితి, విజయం సాధించవచ్చు.

2 / 5

నిరంతర సాధన.. 

ఏ రంగంలోనైనా విజయాన్ని పొందాలంటే నిరంతర సాధన చాలా ముఖ్యం. సరైన జ్ఞానం లేకపోవడం లేదా సాధన చేయకపోవడం వల్ల మన అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే ఒక విషయాన్ని తరచుగా చదవడం, అభ్యాసం చేయడం ద్వారా జ్ఞానాన్ని బలపరచాలి. ఈ విధంగా నిరంతర సాధన మనలను విజయ దిశగా నడిపిస్తుంది.

నిరంతర సాధన.. ఏ రంగంలోనైనా విజయాన్ని పొందాలంటే నిరంతర సాధన చాలా ముఖ్యం. సరైన జ్ఞానం లేకపోవడం లేదా సాధన చేయకపోవడం వల్ల మన అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే ఒక విషయాన్ని తరచుగా చదవడం, అభ్యాసం చేయడం ద్వారా జ్ఞానాన్ని బలపరచాలి. ఈ విధంగా నిరంతర సాధన మనలను విజయ దిశగా నడిపిస్తుంది.

3 / 5

 ధర్మాన్ని గౌరవించడం.. 

జీవితంలో ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతుంది. ధర్మాన్ని గౌరవించే వారు ఎల్లప్పుడూ సమాజంలో గౌరవం పొందుతారు. ఇతరులను మోసం చేయడం, ధర్మం, మత గ్రంథాలను అవమానించడం వంటి పనులు చేసే వారు చివరికి జీవితంలో విఫలమవుతారని కూడా ఇందులో పేర్కొనబడింది.

ధర్మాన్ని గౌరవించడం.. జీవితంలో ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతుంది. ధర్మాన్ని గౌరవించే వారు ఎల్లప్పుడూ సమాజంలో గౌరవం పొందుతారు. ఇతరులను మోసం చేయడం, ధర్మం, మత గ్రంథాలను అవమానించడం వంటి పనులు చేసే వారు చివరికి జీవితంలో విఫలమవుతారని కూడా ఇందులో పేర్కొనబడింది.

4 / 5
సారాంశంగా, గరుడ పురాణం సూచించిన మూడు ముఖ్యమైన సూత్రాలు 
 శత్రువులను తెలివిగా ఎదుర్కోవడం, నిరంతర సాధన చేయడం,  ధర్మాన్ని గౌరవించడం.. ఈ సూత్రాలను జీవితంలో అనుసరించే వారు విజయాన్ని సాధించి, సార్థకమైన జీవితం గడుపుతారని ఈ పురాణం ఉపదేశిస్తుంది. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు  ధృవీకరించదు.)

సారాంశంగా, గరుడ పురాణం సూచించిన మూడు ముఖ్యమైన సూత్రాలు శత్రువులను తెలివిగా ఎదుర్కోవడం, నిరంతర సాధన చేయడం, ధర్మాన్ని గౌరవించడం.. ఈ సూత్రాలను జీవితంలో అనుసరించే వారు విజయాన్ని సాధించి, సార్థకమైన జీవితం గడుపుతారని ఈ పురాణం ఉపదేశిస్తుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us