జనసేనాని సంచలన నిర్ణయం

గత ఎన్నికల్లో ఘోర ఓటమిపై విశ్లేషణ చేసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో వివిధ విభాగాలకు కమిటీలు నియమించారు. ఈ కమిటీల వివరాలను రేపు పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో ప్రకటించబోతున్నారు. పార్టీ సీనియర్లతో అనేక సంప్రదింపులు, విశ్లేషకులు సలహాల అనంతరం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  అలాగే  పార్టీ శ్రేణులను యాక్టీవ్ చేసేందుకు కార్యక్రమాలను రూపొందించేందుకు జనసేన సిద్దమవుతోంది. ఇక.. రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పోలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), […]

జనసేనాని సంచలన నిర్ణయం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2019 | 8:52 PM

గత ఎన్నికల్లో ఘోర ఓటమిపై విశ్లేషణ చేసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో వివిధ విభాగాలకు కమిటీలు నియమించారు. ఈ కమిటీల వివరాలను రేపు పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో ప్రకటించబోతున్నారు. పార్టీ సీనియర్లతో అనేక సంప్రదింపులు, విశ్లేషకులు సలహాల అనంతరం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  అలాగే  పార్టీ శ్రేణులను యాక్టీవ్ చేసేందుకు కార్యక్రమాలను రూపొందించేందుకు జనసేన సిద్దమవుతోంది.

ఇక.. రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పోలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉన్నాయి.