మరణాల రేటును 1.06 శాతంకు పరిమితం చేశాము: జగన్‌

కరోనా రావడమన్నది పాపం, నేరం కాదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంధువులకు కూడా మనం అంత్యక్రియలు చేయకపోవడం విచారకరమని.. మానవత్వమే మరుగున పడుతున్న పరిస్థితులను చూస్తున్నామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరణాల రేటును 1.06 శాతంకు పరిమితం చేశాము: జగన్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 28, 2020 | 4:25 PM

CM YS Jagan on Corona: కరోనా రావడమన్నది పాపం, నేరం కాదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంధువులకు కూడా మనం అంత్యక్రియలు చేయకపోవడం విచారకరమని.. మానవత్వమే మరుగున పడుతున్న పరిస్థితులను చూస్తున్నామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అవగాహన పెంచుకొని, ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. కరోనా వస్తుంది, పోతుంది అని.. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు వేచి చూడాలని ఆయన వివరించారు. మధ్యప్రదేశ్‌ సీఎం కూడా కరోనా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో రోజుకు 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ కేసులు వస్తుండటంతో కాస్త భయపడతారు. దీంతో పరీక్షలు తగ్గించి, రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏపీలో అలా ఎప్పుడూ జరగలేదు. 90శాతం టెస్ట్‌లు కరోనా క్లస్టర్‌లోనే చేస్తున్నాం. కరోనా సోకిన వారికి మంచి వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రంలో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో సగం మందికి నయమైంది. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఆధునిక కార్పొరేట్ ఆసుపత్రులు లేకపోయినా.. మరణాల రేటును 1.06 శాతంకు పరిమితం చేశాం” అని పేర్కొన్నారు.

ఇక కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు అందిస్తున్నామని, పద్ధతి ప్రకారం వారికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని, ప్రజలకు అండగా ఉన్నామని ప్రభుత్వం వైపు నుంచి గట్టి సంకేతం వెళ్లాలని జగన్ తెలిపారు.

Read This Story Also: సవాల్‌ని స్వీకరించిన రాక్‌స్టార్‌.. తల్లి, మేనల్లుడితో కలిసి