ఆర్టీసీలో 90 శాతం మందికి కరోనా-ఎండీ కృష్ణబాబు
ఆర్టీసీ సిబ్బందిలో 741 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో ప్రస్తుతం 530 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. 90 శాతం మంది కరోనా వచ్చిన సిబ్బంది హోం క్వారెంటాయిన్‌లో...

ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ రోజుకి 13 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బందిలో 741 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో ప్రస్తుతం 530 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. 90 శాతం మంది కరోనా వచ్చిన సిబ్బంది హోం క్వారెంటాయిన్‌లో ఉన్నారని అన్నారు. రొటేషన్ పద్దతిలో ఉద్యోగస్తులకు డ్యూటీ వేయమని అధికారుల చెప్పామన్నారు. రాష్ట్రంలోని పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లోని స్టాఫ్ కి సంజీవని బస్సులు ద్వారా టెస్ట్‌లు చేస్తున్నామన్నారు.
11 వేల బస్సులుపై గా సర్వీసుల్లో కేవలం 2500 సర్వీసులు నడుపుతున్నామన్నారు. ప్రభుత్వం లో ఆర్టీసీని విలీనం చేయకుండా ఉంటే మరింత నష్టాల్లోకి వెళ్లివుండేదని అన్నారు. ఎక్కువ సర్వీసులు నడుపుదామని అనుకున్నా… ప్రయాణికుల నుంచి స్పందన పెద్దగా లేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయకుండా ఉంటే కనీసం జీతాలు కూడా చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి ఉండేది కాదన్నారు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.