చెప్పుడు మాటలు విని బాబు నన్ను దూరం పెట్టారు: సతీష్ రెడ్డి

చెప్పుడు మాటలు విని చంద్రబాబు తనను దూరం పెట్టారని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం టీడీపీని వీడిన సతీష్ రెడ్డి.. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్‌కు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే

చెప్పుడు మాటలు విని బాబు నన్ను దూరం పెట్టారు: సతీష్ రెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 10, 2020 | 9:39 PM

చెప్పుడు మాటలు విని చంద్రబాబు తనను దూరం పెట్టారని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం టీడీపీని వీడిన సతీష్ రెడ్డి.. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్‌కు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. తనకు చావ తగ్గలేదని అన్నారు. ఇప్పుడు తనపై బాధ్యత పెరిగిందని.. కానీ పోరాడేందుకు కావాల్సిన భరోసా లేదని తెలిపారు. ఓడిపోయిన తరువాత చంద్రబాబు పిలిచి మాట్లాడిన సందర్భం లేదని ఆయన మనోవేదన వ్యక్తం చేశారు. తనకు వేధింపులు ఉన్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని.. బాబు ఇప్పటికైనా మారాలని అన్నారు. కాంప్రమైజ్ అన్నది తన రక్తంలోనే లేదని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సతీష్ రెడ్డి రాజీనామా చేయడంతో.. పులివెందుల ఇంచార్జ్‌గా టీడీపీ అధిష్టానం బీటెక్ రవిని నియమించారు.

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!