ఏపిని వెంటాడుతున్న కరోనా విలయ తాండవం చేస్తోంది. మొదటి నుంచి కరోనాకు దూరంగా ఉన్న విజయనగరం జిల్లాలో కరోనా కలవరం మొదలైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించిన కరోనా తాజాగా విజయనగరం జిల్లాలో కూడా పంజా విసురుతోంది. అంతేకాదు, కోవిడ్ కోరల్లో చిక్కుకుని ఒకరు మరణించారు. బలిజిపేట మండలం చిలకపల్లికి చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లిన వృద్ధురాలికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.