AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

స్థానికులు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు కోరినా... పరిస్థితి అదుపులోకి రాలేదు.

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
Jyothi Gadda
|

Updated on: May 09, 2020 | 1:36 PM

Share
విశాఖ‌లోని ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. త‌క్ష‌ణ‌మే కంపెనీని మూసివేయాలంటూ స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోన‌కారుల‌ను చెద‌ర‌గొట్టారు. ప‌లువురిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, స్థానికుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను చూసేందుకు డీజీపీ సవాంగ్‌తో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ ఘ‌ట‌నాల‌నికి వెళ్ల‌గా… స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహాలతో ఆందోళనకు దిగిన స్థానికులు తమకు న్యాయం చెయ్యాలంటూ… డీజీపీ, మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కంపెనీని వెంటనే మూసివేయాలంటూ పెద్ద ఎత్తున గుమిగూడిన జనం నినాదాలు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. గ్యాస్ లీక్ ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. ఇప్పటివరకు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిప‌డ్డారు.. దాంతో… పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో…ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు కోరినా… పరిస్థితి అదుపులోకి రాలేదు. పరిశ్రమ గేట్లను తోసివేసి… స్థానికులు లోపలికి వెళ్లి మరీ డీజీపీ, మంత్రిని అడ్డుకున్నారు. మృతదేహాలతో ధర్నాకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..