AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

ఆగస్ట్‌ 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. ఆరోజును ఆనందంగా జరుపుకునేందుకు రెండ్రోజుల ముందునుంచే అందరూ ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని స్కూళ్లలో ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇలానే ఓ స్కూల్‌లో కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా గేమ్స్ పెట్టారు. చిన్నారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ క్షణాల్లోనే వారి ఉత్సాహం విషాదంగా మారింది. ఊహించని ఓ ప్రమాదం ఓ చిన్నారి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. అసలు ఆ స్కూల్‌లో ఏ జరిగిందో తెలుసుకోవాలి అంటే ఆ స్టోరీ చదవాల్సిందే!

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!
Independence Day Tragedy
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 9:35 AM

Share

యాదాద్రి జిల్లా భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదంతో చిన్నారుల ఆనందం కాసేపటికే విషాదంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఏళ్ల నాటి భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పలువురు విద్యార్థులు చెట్టు కింద చిక్కుకున్నారు. క్షణాల్లోనే ఆటల మైదానం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆటలాడుతున్న చిన్నారులపై ఒక్కసారిగా భారీ చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో కొందరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

హాలీమాకు తప్పని విషాదం..

ఈ ఘటనలో మూడో తరగతి చదువుతున్న హాలీమా తీవ్రంగా గాయ పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారుల కాళ్లు విరిగి తీవ్ర గాయాల య్యాయి. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

ఆరు నెలల క్రితమే హెచ్చరికలు..

ఈ ఘటనపై స్థానికుల తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి గురైన వేపచెట్టులో ఆరు నెలల క్రితం లోపలి భాగంలో మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారనీ చెబుతున్నారు. అయితే చెట్టు అంతర్భాగం కాలిపోవడంతో అది బలహీనపడిందని అప్పుడే ఫైర్ సిబ్బంది హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా ప్రమాదకరంగా మారిన చెట్టును తొలగించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

పాఠశాల అంటే పిల్లలకు భద్రమైన ప్రదేశం కావాలి. కానీ అదే పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా మారిన చెట్టు ఉండటం.. ముందే దాని పరిస్థితిపై హెచ్చరికలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హాలీమా ఇక తిరిగిరాదు. కానీ మరో హాలీమా ప్రాణం పోకుండా ఉండాలంటే ఇప్పటికైనా పాఠశాలల ఆవరణలోని ప్రమాదకర చెట్లు, భవనాలు, విద్యుత్‌ లైన్లు తదితర వాటిపై అధికారులు సమగ్ర తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శ..

ఈ ఘటనలో మృతి చెందిన మూడో తరగతి విద్యార్థిని హలీమా కుటుంబాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఆ కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. మరోవైపు ఈ ఘటంలో గాయపడిన చిన్నారులను ఎయిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం
పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క.. ఇప్పుడిలా..
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క.. ఇప్పుడిలా..
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు