21న విజయవాడకు జగన్.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

21న విజయవాడకు జగన్.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న విజయవాడకు వెళ్లనున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 13, 2020 | 10:45 AM

YS Jagan Vijayawada tour: దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ శ్రీ దుగ్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఈ 17 నుంచి 25 వరకు దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ప్రారంభించేశారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. ఇక 21న పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం వైఎస్ జగన్ కూడా అక్కడకు వెళ్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,708 కొత్త కేసులు.. 5 మరణాలు

Bigg Boss 4: అనారోగ్యానికి గురైన మోనాల్‌.. తెగ ఫీల్ అయిన అఖిల్‌‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu