యుద్ధరంగంలో సైనికులే మీరు: ‘సీబీఎన్ ఆర్మీ’కి బాబు కితాబు
ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ధీమాగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, కొత్తగా ఏర్పడిన ‘సీబీఎన్ ఆర్మీ’కి కితాబిచ్చారు. యుద్ధరంగంలో సైన్యంలా ఈ ఎన్నికల కోసం సీబీఎన్ ఆర్మీ పనిచేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవా మిత్రులతో చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జాబ్‌లకు సెలవులు పెట్టి పార్టీకి సేవలందించారని, నిరుద్యోగులైతే సొంత పనిగా పార్టీ కోసం పనిచేశారని ప్రశంసించారు. టీడీపీ శ్రేణుల్లో ఇంత పోరాట […]
ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ధీమాగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, కొత్తగా ఏర్పడిన ‘సీబీఎన్ ఆర్మీ’కి కితాబిచ్చారు. యుద్ధరంగంలో సైన్యంలా ఈ ఎన్నికల కోసం సీబీఎన్ ఆర్మీ పనిచేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవా మిత్రులతో చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జాబ్‌లకు సెలవులు పెట్టి పార్టీకి సేవలందించారని, నిరుద్యోగులైతే సొంత పనిగా పార్టీ కోసం పనిచేశారని ప్రశంసించారు. టీడీపీ శ్రేణుల్లో ఇంత పోరాట పటిమను తాను ఎప్పుడూ చూడలేదని సంతృప్తి వ్యక్తం చేశారు. అధినేత వ్యాఖ్యలతో ఈ ఆర్మీ ఉబ్బి తబ్బిబ్బౌతోంది.