విశాఖ కలెక్టర్‌పై ‘దాడి’
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ భాస్కర్ కారణంగా 4వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని వైసీపీ నేత దాడి వీరభద్రరావు మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ విషయంలో కలెక్టర్ పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఇతర జిల్లాల కలెక్టర్లకు భిన్నంగా భాస్కర్ వ్యవహరిస్తున్నాడని, ఇదే పరిస్థితి కొనసాగితే కౌంటింగ్ సమయంలోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలను కలెక్టర్ బయటపెట్టాలని ఈ సందర్భంగా దాడి డిమాండ్ చేశారు.