Bank Holiday: పండుగ వేళ కస్టమర్లకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవే..
సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. ఇప్పటికే.. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో అందరూ ఊర్లకు చేరుకుని సందడి చేస్తున్నారు.. అయితే.. బ్యాంకు హాలిడేస్ పై ఇప్పటికీ.. సందిగ్దత కొనసాగుతోంది.. భోగి రోజున సెలవు లేదు.. మకర సంక్రాంతి రోజున బ్యాంకులకు సెలవు ఉంది..
సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. ఇప్పటికే.. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో అందరూ ఊర్లకు చేరుకుని సందడి చేస్తున్నారు.. అయితే.. బ్యాంకు హాలిడేస్ పై ఇప్పటికీ.. సందిగ్దత కొనసాగుతోంది.. భోగి రోజున సెలవు లేదు.. మకర సంక్రాంతి రోజున బ్యాంకులకు సెలవు ఉంది.. అయితే.. కనుమ నాడు సెలవుపై క్లారిటీ వచ్చింది.. 15వ తేదీ కనుమ రోజు బ్యాంకులకు సెలవు ఇచ్చినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కోరిక మేరకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది..
అయితే.. కనుమ నాడు.. తెలంగాణలో మాత్రం బ్యాంకులు యథావిధిగా కొనసాగుతాయి.. దీనిపై బ్యాంకర్ల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు..
కాగా.. జనవరి 15న ఏపీలో బ్యాంకులకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో కస్టమర్లు దానికి తగినట్లు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకర్ల ప్రతినిధులు కోరుతున్నారు.. ఆ తర్వాత మరుసటి రోజు అంటే.. గురువారం బ్యాంకులు యథావిధిగా తెరుచుకోనున్నాయి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..