ఇక జగన్‌కే మా సేవలు.. స్టీఫెన్, శ్రీలక్ష్మీ..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడానికి అవసరమైన ఇంటర్ క్యాడర్ డెప్యూటేషన్‌కి ఇంతకాలం అడ్డుచక్రం వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీకి బదిలీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ మాత్రం […]
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడానికి అవసరమైన ఇంటర్ క్యాడర్ డెప్యూటేషన్‌కి ఇంతకాలం అడ్డుచక్రం వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీకి బదిలీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ మాత్రం అంగీకరించలేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ వారి ఫైళ్లకు క్లియరెన్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా శ్రీలక్ష్మిని ఢిల్లీ తీసుకొచ్చి మరీ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎట్టకేలకు ఇద్దరి బదిలీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి బదిలీకి అవసరమైన ఇంటర్ క్యాడర్ డెప్యూటేషన్ ఫైళ్లపై కేంద్రం ఆమోదముద్ర వేయనుందని, అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.